ఆదిలాబాద్ , జగిత్యాల క్రైం : జిల్లాలో కల్తీ నూనెలపై ‘కల్తీ..కల్తీ’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఎస్పీ అనంతశర్మ స్పందించారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలోగల రెండు ఆయిల్ మిల్లులపై దాడులు చేశారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో ప్యాకెట్లు తయారుచేస్తున్న ఆయిల్ మిల్లులను సీజ్‌చేశారు. సోమేశ్వర ట్రేడర్స్ ఆయిల్‌మిల్లుపై దాడులు చేయగా.. అందులో వివిధ కంపెనీల పేర్లతో లూజ్ ఆయిల్‌ను ప్యాకెట్లలో తయారుచేస్తున్నారు.
ఆయిల్‌లో కల్తీతోపాటు చెత్తాచెదారం ఉండటంతోమిల్లును సీజ్ చేశారు. ఎస్పీ అనంతశర్మ మాట్లాడుతూ కల్తీ నూనెలపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని చెప్పారు. కొంతమంది వ్యాపారులు నాణ్యత లేని నూనెలు తీసుకొచ్చి బ్రాండెడ్ కంపెనీల పేరుతో ప్యాకెట్లను ముద్రిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమేశ్వర ఆయిల్‌మిల్లుపై కేసు నమోదు చేస్తామని, నాణ్యత ప్రమాణాలపై ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించి పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో టౌన్ ఇన్‌చార్జి సీఐ కృపాకర్, ఎస్సైలు లక్ష్మీనారాయణ, ప్రసాద్, జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆయిల్ మిల్లులపై పోలీసుల దాడులు
Published Thu, Sep 28 2017 1:03 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement