
సాక్షి, మంచిర్యాల: ‘ఏం.. ఎంత చెప్పిన వినరే... తమాషా చేస్తున్నారా...? రెండు గంటల తర్వాత లాక్‌డౌన్ ఉందన్న సంగతి తెలియదా...’ అంటూ అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై రామగుండం పోలీసు కమిషనర్ వి.సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్ పరిస్థితిని పర్యవేక్షించారు. స్థానిక బెల్లంపల్లి చౌరస్తాలో రెండుగంటలపాటు పరిశీలించారు. చిన్న చిన్న కారణాలు చెబుతూ పాస్‌లతో తిరుగుతున్న వారిపై మండిపడ్డారు. కరోనాతో అనేకమంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. అందరికీ జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం సీపీ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పోలీసులు పడుతున్న కష్టానికి ఇలాంటి ఆకతాయిల వల్ల ఫలితం లేకుండా పోతుందని అన్నారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఎవరూ బయటకు రావొద్దని, ఇకపై లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయని అన్నారు. రోడ్లపైకి వస్తే కోవిడ్ పరీక్షలు చేసి ఐసోలేషన్‌కు తరలించడంతోపాటు కేసు నమోదు చేస్తామని తెలిపారు. పట్టణాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, పల్లెల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు. వివాహ వేడుకల ద్వారా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు పో లీసుల సూచనలు పాటించాలని తెలిపారు. డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, సీఐలు ముత్తి లింగయ్య, శ్రీనివాస్, రాజు, ఎస్సైలు పాల్గొన్నారు.
చదవండి:
Loan App: నకిలీ లెటర్‌తో రూ.కోటి కొట్టేశాడు..!
కాషాయ గూటికి చేరిన ఈటల.. మిగిలింది ఉప ఎన్నికే,,
Comments
Please login to add a commentAdd a comment