
సాక్షి, వనపర్తి: జిల్లాలోని కొత్త కనిమెట్ట వద్ద జాతీయ రహదారి 44పైన బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక కారు టైర్ పంక్చర్ కావడంతో మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో రెండు కార్లలో మొత్తం 11మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 8మంది మరణించగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల్లోనే ఏడుగురి మృతదేహాలు చిక్కుకున్నాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు పురుషులు ఉన్నారు. మృతులు హైదరాబాద్ వాసులని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు నంబర్లు, TS 08 EQ 8108, TS 08 UA 3801.
దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హైవేపై రద్దీని క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment