లక్నో: ఉత్తరప్రదేశ్ రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం సహాయ చర్యలు అందించటంలో నిమగ్నమైందని ఆయన తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.మరోవైపు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కార్మికులు ప్రమాదంలో మృతి చెందటం దురదృష్టకరమని, మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా ప్రమాదంతో తీవ్రంగా గాయలైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి సమగ్ర విచారణ చేపట్టాలిని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా శనివారం ఉదయం యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
వలస కూలీల ట్రక్కును మరో ట్రక్కు కొట్టడంతో 24 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా పొట్ట చేతపట్టుకుని వేరే రాష్టాలకు వెళ్లిన వలస కూలీలు. వలస కూలీలు ప్రయాణిస్తున్న ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఔరాయ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడగా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన 36 మంది వలస కూలీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
उत्तर प्रदेश के औरैया में सड़क दुर्घटना बेहद ही दुखद है। सरकार राहत कार्य में तत्परता से जुटी है। इस हादसे में मारे गए लोगों के परिजनों के प्रति अपनी संवेदना प्रकट करता हूं, साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं।
— Narendra Modi (@narendramodi) May 16, 2020
Comments
Please login to add a commentAdd a comment