సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఆదివారం అర్థరాత్రి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. బ్యాంకు వెనుక గోడకు రంధ్రం వేసి దుండగులు లోనికి ప్రవేశించారు.
లాకర్ తెరిచేందుకు ప్రయత్నించగా అది ఎంతకీ తెరుచుకోకపోవడంతో దుండగులు పరారయ్యారు. సోమవారం బ్యాంకుకు వచ్చిన సిబ్బంది చోరీ యత్నాన్ని గ్రహించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment