
సాక్షి, జనగామ : జనగామ మండలం పెంబర్తి గ్రామం వద్ద బుధవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి హన్మకొండకు వస్తున్న క్రమంలో పెంబర్తి వద్ద లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సులో ఉన్న ప్రయాణీకులకు స్వల్పగాయాలు అవ్వడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వన్ వే ఉన్న రోడ్డుపై మరమ్మత్తుల కారణంగా డ్రైవర్ నిద్ర మత్తులో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదాలకు గురైన వాహనాలను పక్కకు జరిపి ప్రయాణికులను ఇతర బస్సులో పంపించారు. కాగా డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment