
సాక్షి, పశ్చిమగోదావరి : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ గురువు కామాంధుడిగా మారాడు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. ఈ ఘటన జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్ళ జిల్లా పరిషత్ హైస్కూళ్లో వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే స్కూల్లో తెలుగు మాష్టారుగా పనిచేస్తున్న కొయ్య లక్ష్మణ్ రావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక బంధువులు, గ్రామస్తులు హైస్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment