
ఉండ్రాజవరం పోలీస్‌స్టేషన్‌లో కేసు వివరాలు పరిశీలిస్తున్న డీఎస్పీ రాజేశ్వరరెడ్డి
పశ్చిమగోదావరి ,ఉండ్రాజవరం: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై వరుసకు మేనమామ అయిన సమీప బంధువు (30) లైంగికదాడికి పాల్పడిన ఘటన మండలంలోని వడ్లూరులో చోటుచేసుకుంది. కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి మంగళవారం ఉండ్రాజవరం పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. వడ్లూరులోని ఓ కుటుంబానికి చెందిన పెద్ద రిక్షా తొక్కుకుని జీవనం సాగించగా అతడి భార్య స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తుంది. వీరికి ఐదో తరగతి చదువుతున్న 11 ఏళ్ల కుమార్తె ఉంది. స్థానికంగా పాఠశాలలో చదువుతున్న బాలిక సాయంత్రం స్కూల్ విడిచిన తర్వాత ఇంటికి వచ్చి తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు ఒంటరిగా ఉంటోంది. బాలిక ఒంటరితనాన్ని పసిగట్టిన వివాహితుడైన సమీప బంధువు నాలుగు రోజుల క్రితం ఆమె ఇంటికి వచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు.
అయితే విషయాన్ని బాలిక భయంతో ఎవ్వరికీ చెప్పలేదు. అప్పటినుంచి బాలిక తల్లిదండ్రుల ఫోన్‌కి నిందితుడు బాలిక కోసం ఫోన్‌లు చేస్తున్నాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బాలికను నిలదీయగా జరిగిన విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు బాలికతో నిందితుడికి ఫోన్ చేయించి అసలు విషయాన్ని రాబట్టి ఫోన్‌లో నిందితుడి వాయిస్‌ను రికార్డ్ చేశారు. అనంతరం సోమవారం రాత్రి తణుకు సీఐ ఆఫీసులో íఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దిశ యాక్ట్ స్ఫూర్తిగా తీసుకుని వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని డీఎస్పీ రాజేశ్వరరెడ్డి చెప్పారు. దేశంలో రోజురోజుకూ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల కేసుల గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను మేజిస్ట్రే్టట్ ముందు ఉంచి నిందితుడికి సరైన శిక్ష పడేట్టు చూస్తామన్నారు. తణుకు సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై ఇల్లంకుల అవినాష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment