
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: వంద రూపాయలు ఇస్తా.. ముద్దిస్తావా.. అంటూ బాలికను యువకుడు వేధించిన ఘటనపై ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌లో బుధవారం కేసు నమోదైంది. ద్వారకాతిరుమల ఎస్సై ఎం. సూర్యభగవాన్ తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని తిమ్మాపురంలో నివాసం ఉంటున్న 12 ఏళ్ల బాలిక తండ్రితో కలిసి మంగళవారం మధ్యాహ్నం పుల్లలు ఏరుకునే నిమిత్తం పొలానికి వెళ్లింది. అక్కడ పుల్లలు ఏరుకున్న తర్వాత తండ్రి ముందు గా వెళ్లిపోయాడు. అదేసమయంలో రామన్నగూడెం పంచాయతీ దేవినేనివారిగూడెంకు చెందిన మోటమర్రి నాగసూర్య బాలాజీ అనే యువకుడు బాలిక వద్దకు వెళ్లి పుల్లల మోపు ఎత్తాడు. తర్వాత వంద ఇస్తాను.. ముద్దిస్తావా అంటూ ఆమె చేయి పట్టుకుని లైంగికదాడికి యత్నించాడు. బాలిక కేకలు వేసుకుంటూ అతడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరి విషయాన్ని తండ్రికి చెప్పింది. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment