అమెజాన్ లోగో
హైదరాబాద్ : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ను మోసగించిన ఆరుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఆన్‌లైన్ ద్వారా 300 వస్తువులను ఆర్డర్ చేసి డెలివరీ అయ్యాక.. రాలేదంటూ మోసానికి పాల్పడ్డారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
‘నిందితులు అమెజాన్ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి డెలివరీ కాలేదంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారు. ఇలా ఒక్కో ఆర్డర్ మీద రెండు వస్తువులను దక్కించుకున్నారు. సెల్ ఫోన్లను బుక్ చేసి డెలివరీ అయ్యాక తక్కువ ధరకు ఓఎల్‌ఎక్స్‌లో అమ్ముకున్నారు. ఆర్డర్ చేసిన ప్రతీసారి ఒక కొత్త సిమ్‌ను ఉపయోగించారు. అనుమానం రాకుండే ఉండేందుకు వివిధ ప్రదేశాల నుంచి ఆర్డర్ చేసేశారు. వారి నుంచి 10 లక్షల 75 వేల రూపాయల నగదు, 556 సిమ్ కార్డులు, 42 సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ టాప్స్ స్వాధీనం చేసుకున్నాం. 800 ఫోన్లు బుక్ చేసి అదనంగా 800 ఫోన్లను దక్కించుకున్నార’ని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment