బాధితులకు ఫోన్లు అందజేస్తున్న డీసీపీ
గచ్చిబౌలి: హాస్టళ్లు, ఇళ్లలో సెల్ ఫోన్ చోరీలు, సెల్ ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు యువకులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వెంకటేశ్వర్‌రావు వివరాలు వెల్లడించారు. రాయదుర్గంలో ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్న జార్ఖండ్‌కు చెందిన బబ్లూ రాజ్ అలియాస్ జాన్‌సన్,, టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తూ అంజయ్యనగర్‌లో ఉంటున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వీరాంజనేయులు, గచ్చిబౌలి వడ్డెర బస్తీకి చెందిన నాగరాజు, మరో మైనర్ బాలుడు(17) ముఠాగా ఏర్పడి సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నారు. వీరు హాస్టళ్లు, ఇళ్లను టార్గెట్ చేసుకుని ఫోన్లు ఎత్తుకెళ్లేవారు. ఫోన్‌లో మాట్లాడుకుంటూ వెళ్లే వారి నుంచి సెల్‌ఫోన్లు లాక్కెళ్లేవారు. గచ్చిబౌలి, మాదాపూర్, కేపీహెచ్‌బీ పీఎస్‌ల పరిధిలో వారిపై ఐదు కేసులు నమోదయ్యాయి. చోరీ చేసిన ఫోన్లను తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారు. గచ్చిబౌలి పీస్ పరిధిలో 8, మాదాపూర్ పీఎస్ పరిధిలో 3, కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో 3 సెల్ ఫోన్లు మొత్తం 17 సెల్ ఫోన్లు చేసినట్లు తెలిపారు. వారి నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు.
సమావేశంలో ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు, గచ్చిబౌలి డీఐ సత్యనారాయణ, మాదాపూర్ సీఐ నాగేశ్వర్ రావు, డీఐ ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాధితులకు ఫోన్ల అప్పగింన్లైటీ కారిడార్‌లో క్యాబ్‌లు, బస్సులు, ఆటోల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ఫిర్యాదులన్నున్నట్లు డీసీపీ తెలిపారు. ఈఎంఐ నంబర్ ఆధారంగా ట్రాకింగ్ చేసి 38 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, బాధితుల వివరాలు సేకరించి సెల్ ఫోన్లను వారికి అప్పగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గురువారం 10 మంది బాధితులకు సెల్ ఫోన్లను అప్పగించారు. మరో 28 మందికి ఇప్పటికే సమాచారం అందించామని వారికి సెల్ ఫోన్లు అందజేస్తామన్నారు. దొరికిన సెల్ ఫోన్లను పోలీసులకు అప్పగించని అమాయకులపై కేసులు నమోదు చేయడం లేదన్నారు. పాత నేరస్తులు ఉంటే కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కోర్టుకు పంపిస్తే తిరిగి బాధితుని అందే సరికి చాలా సమయం పడుతుందన్నారు. సెల్ ఫోన్ దొరికిందన్న సంతోషం కూడా ఉండదన్నారు. ఈ నేపథ్యంలో స్వాధీనం చేసుకున్న ఫోన్లను తామే నేరుగా బాధితులకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment