మల్లాపూర్: మసాజ్ సెంటర్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని నాచారం పోలీసులకు అప్పగించారు. మల్కాజిగిరి ఎస్‌ఓటీ ఇన్‌స్పెక్టర్ నవీన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాచారం పోస్టాఫీస్ సమీపంలో శ్రీరామ్ అనే వ్యక్తి ఎస్సెన్జ్ స్పా ఎన్ సెలూన్ నిర్వహిస్తున్నాడు. కొందరు యువతలను రప్పించి క్రాస్ మసాజ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి నిర్వాహకులు శ్రీరామ్, మణికంఠ, రాజేష్‌తో పాటు నాగేశ్వర్‌రావు, సంతోష్, మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.7570 నగదు, బిల్ బుక్స్, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని నాచారం పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment