ప్రియురాలితో కలిసి ఉండడం చూశాడని.. | Student Was Assassinated By A Boy In Tamil Nadu State | Sakshi
Sakshi News home page

ప్రియురాలితో కలిసి ఉండడం చూశాడని..

Published Mon, Jun 15 2020 6:54 AM | Last Updated on Mon, Jun 15 2020 6:54 AM

Student Was Assassinated By A Boy In Tamil Nadu State - Sakshi

ప్రేమజంట(ఇన్‌సెట్‌) హత్య గురైన భువనేష్‌ (ఫైల్‌)

సాక్షి, చెన్నై: కళాశాల విద్యార్థి ప్రియురాలితో కలసి ఉండగా చూశాడని ముక్కుపచ్చలారని బాలుడిని ఓ విద్యార్థి దారుణంగా చంపాడు. పోలీసుల వివరాల మేరకు.. తిరుప్పూరు జిల్లా ఊత్తుకులి సమీపం సొట్టక వుండమ్‌ పాళయం సమీప ప్రాంతానికి చెందిన తంగరాజ్‌ – సుమతి దంపతులకు విఘ్నేష్‌ (9), భువనేష్‌ (9) కవల పిల్లలు ఉన్నారు. దంపతులు ఓ బనియన్‌ కంపెనీలో పని చేస్తున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంటారు. వారు పనికి వెళ్లాక భువనేష్‌ అదృశ్యమయ్యాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చాక ఆ దంపతులు పలు చోట్ల వెదికారు. ఊత్తుకులి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో స్థానిక చెరువు ప్రాంతంలో భువనేష్‌ మృతదేహం కనిపించింది. కడుపు, గొంతు భాగాల్లో పొడిచి బాలుడిని చంపినట్లు పోలీసులు గుర్తించారు.  ఏడు ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు చేపట్టారు. భువనేష్‌ ఇంటికి సమీపంలో ఉంటున్న ఓ కళాశాల విద్యార్థిని తన ప్రియుడైన పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థితో కలిసి బయటకు వెళ్లింది. అనంతరం వాళ్లు అదే ప్రాంతంలోని చెరువు వద్ద సన్నిహితంగా ఉండడాన్ని భువనేష్‌ చూశాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భయపడ్డారు. భువనేష్‌ని ఆ విద్యార్థి కత్తితో పొడిచి చంపేసి పొదల్లో పడేశాడని వెల్లడైంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. చదవండి: ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement