
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ నాగేంద్రకుమార్
సాక్షి, జగ్గయ్యపేట(కృష్ణా) : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నవాబుపేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సువర్ణకంటి చిన్నగిరయ్య కుమారుడు గణేష్(20) ఆటో నడపటంతో పాటు డీజే సౌండ్ సిస్టమ్ వారి దగ్గర పనికి వెళ్తుంటాడు. తల్లి సైదమ్మ పదేళ్ల క్రితం మృతి చెందగా, నాయనమ్మ పెంచి పెద్ద చేసింది. శనివారం రాత్రి ఇంటికి వచ్చి గదిలో వెళ్లి పడుకున్నాడు. ఉదయం ఎంత సేపటికి తలుపు తీయక పోవటంతో చుట్టు పక్కల వారు వచ్చి తలుపులు పగుల కొట్టగా గణేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు. జగ్గయ్యపేట సీఐ నాగేంద్రకుమార్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతికి ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అస్ఫాక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment