సెల్ఫీ కోసం బాలిక స్టీల్‌ప్లాంటుకు వెళ్లగా.. | Teenage girl died while taking selfie at steel plant | Sakshi
Sakshi News home page

సెల్ఫీ కోసం బాలిక స్టీల్‌ప్లాంటుకు వెళ్లగా..

Published Tue, Nov 14 2017 9:52 AM | Last Updated on Mon, Apr 8 2019 6:21 PM

Teenage girl died while taking selfie at steel plant - Sakshi

సాక్షి, బొకారో :  జార్ఖండ్‌లో ఓ సెల్ఫీ విషాదం చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకునే యత్నంలో ఓ మైనర్‌ బాలిక ప్రాణాలు పోగొట్టుకుంది. పోలీసుల కథనం ప్రకారం..  సులేఖా కుమారి అనే 16 ఏళ్ల బాలిక స్థానిక బడా ఖట్మల్ కశ్మీరీ కాలనీలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం బొకారో స్టీల్ ప్లాంట్ వద్దకు సులేఖా వెళ్లింది. ప్లాంట్ వద్ద కూలింగ్ పాండ్ (కొలను) పైన నిల్చుని సెల్ఫీ తీసుకోవాలని భావించింది. తన స్మార్ట్‌ఫోన్లో సెల్ఫీ తీసుకునే యత్నంలో కాలుజారి ఆ కొలనులో పడిపోయి మృతిచెందింది. ఆమె మృతదేహం కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. బాలిక మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement