సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్బంగా తాళం వేసిన ఇళ్లను దొంగలు టార్గెట్ చేశారు. విజయవాడ పటమటలోని మారుతీ కాలనీలో శ్రీనివాసరావు అనే వ్యక్తి పండుగ సందర్బంగా ఊరు వెళ్లారు. దీనిని అదునుగా చేసుకుని ఆదివారం రాత్రి దొంగలు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.
ఇంటిలో వున్న బీరువాలోని 70 కాసుల బంగారాన్ని దోచుకెళ్లారు. ఉదయం ఇంటి తాళం ఓ పక్కకు వేళ్లాడుతుండటంతో పొరుగింటి వారు శ్రీనివాసరావు కుటుంబానికి సమాచారం అందించారు. బాధితుడు హుటాహుటిన వచ్చి చూడగా బంగారు నగలు చోరీ జరిగినట్లు గుర్తించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జాగిలాలతో ఆధారాలను సేకరిస్తున్నారు. దొంగల కోసం గాలింపు చర‍్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment