
సాక్షి, విజయవాడ : విజయవాడలో పట్టపగలు దారుణం జరిగింది. ఓ ఇంట్లోకి ప్రవేశించి మహిళను హత్య చేసేందుకు ఇద్దరు కుర్రాళ్లు ప్రయత్నించారు. ఈ ఘటన విజయవాడలోని సత్యనారాయణపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలివి.. ఇద్దరు యువకులు పద్మావతి(48) ఇంట్లోకి దొంగతనానికి చొరబడ్డారు. అది గమనించిన ఆమె వారిద్దరిపై ఎదురు తిరిగింది. దీంతో ఆ యువకులు మహిళ మెడ కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యారు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడివున్న ఆమెను పోలీసులు ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పద్మావతి ఇంట్లో దొంగతనం, హత్యాప్రయత్నం తర్వాత దుండగులు మరో అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు. అక్కడ పనిచేసే వాచ్‌మెన్‌ని దుస్తులు ఇవ్వమని బెదిరించారు. వెంటనే వాచ్‌మెన్ ఎవరూ.. ఏం దుస్తులని అడగడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment