
అప్పటి వరకు ఆడుతూ తమ ముందే తిరిగిన పిల్లలు
సాక్షి, సిద్దిపేట : పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. కోమటి చెరువులో పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈత కొట్టడానికి మంగళవారం చెరువుకు వెళ్లిన చిన్నారులు లక్ష్మణ్(10), గణేష్(15)లు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తుదిశ్వాస విడిచారు. అప్పటి వరకు ఆడుతూ తమ ముందే తిరిగిన పిల్లలు విగత జీవులుగా మారడంతో ఆ చిన్నారుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.