మిస్టరీగానే ఉస్మాన్‌ అదృశ్యం! | TTDP Leader Usman Missing Mystery In Kamareddy | Sakshi
Sakshi News home page

మిస్టరీగానే ఉస్మాన్‌ అదృశ్యం!

Published Wed, Apr 25 2018 12:29 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

TTDP Leader Usman Missing Mystery In Kamareddy - Sakshi

సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రానికి చెందిన టీడీపీ నాయకుడు ఎండీ ఉస్మాన్‌ అదృశ్యం మిస్టరీ వీడడం లేదు. బెంగళూరు వెళ్లిన ఉస్మాన్‌ ఈనెల 9నుంచి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. ఇప్పటికీ ఫోన్‌ ఆన్‌ చేయలే దు. కాగా ఉస్మాన్‌ ఆచూకీ కోసం ఆయ న కుటుంబీకులు, బంధువులు ఇటీవల బెంగళూరుకు వెళ్లి ఆయన ఆచూకీ కో సం ఆరా తీశారు. అయితే ఎక్కడా ఉస్మాన్‌ ఆచూకీ దొరక్క నిరాశతో వచ్చేశారు. ఉస్మాన్‌ సెల్‌ఫోన్‌ పక్షం రోజులు గా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడం మూలంగా ఆయన ఎక్కడిక వెళ్లింది తెలియరావ డం లేదు. పోలీసులు ఉస్మాన్‌ ఆచూకీ కోసం టెక్నికల్‌గా ప్రయత్నం చేసినా ఆచూకీ దొరకడం లేదని తెలుస్తోంది. ఆయన బెంగళూరులో ఉన్నపుడు ఫోన్‌ ఆన్‌ చేసి ఉన్నన్ని రోజులు ఏయే ప్రాం తంలో తిరిగింది మాత్ర మే తెలుసుకోగలిగారు. స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో ఆయన అదృశ్యం ఎవరికీ అంతుపట్ట డం లేదు. స్థానికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ, టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఉస్మాన్‌కు ఏ వివాదా లు లేవని చెబుతున్నారు. హైదరాబాద్‌ లోనూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన ఉస్మాన్‌కు అక్కడ ఏమైనా తగాదాలు ఉన్నాయా అన్నది మాత్రం వెల్లడి కాలే దు. ఉస్మాన్‌ ఫోన్‌ ఆన్‌ చేస్తే గాని ఆయన ఆచూకీ తెలుసుకునే పరి స్థితి లేదంటున్నారు. ఆయన గతంలో గల్ఫ్‌ కు వెళ్లి వ చ్చాడు. గల్ఫ్‌కు వెళ్లాల్సి వస్తే కుటుం బీకులకు సమాచారం ఇచ్చేవాడు.

లోతైన విచారణ అవసరం..
ఉస్మాన్‌ సెల్‌ఫోన్‌ ఆన్‌ చేస్తేగాని ఆయన ఆచూకీ దొరికే పరిస్థితి నెలకొంది. పక్షం రోజులుగా పోలీసులు కూడా టెక్నికల్‌ అంశాలను పరిశీలించినా ఫలితం లేదు. ఫోన్‌ ఆన్‌ చేస్తే ఎక్కడ ఉన్నది తెలుసుకోగలుగుతామని పోలీసు అధికారులు అంటున్నారు. కామారెడ్డిలో ఏళ్ల తరబడిగా వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న ఉస్మాన్‌తో పెద్దగా ఎవరితోనూ గొడవలు లేవు.
ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఆకస్మాత్తుగా ఉస్మాన్‌ అదృశ్యంతో టీడీపీ నాయకులు కూడా ఆందోళన చెంది పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందించారు. అయితే ఏదైనా భూమి తగాదాల మూలంగా ఆయన్ను ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కిడ్నాప్‌ చేసి ఉంటే ఏదో ఒక రకంగా బయటకు వచ్చేది. ఈ విషయంలో పోలీసు యంత్రాంగం మరింత లోతుగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement