బెంగళూరు: రైలు వస్తుండగా టిక్‌టాక్ వీడియో తీయబోయి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన బెంగళూరులో జరిగింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బయప్పనహళ్లి రైల్వేస్టేషన్ పరిధిలో శివరామ్ కారంత నగర రెండో స్టేజీ సమీపంలోని శ్రీరామపుర రైల్వేగేటు రైలు వస్తుండగా పట్టాలపై అఫ్తాబ్ షరీఫ్ (19), మహమ్మద్ మతీమ్(23), జనీవుల్లా (21)లు కలిసి టిక్‌టాక్ కోసం వీడియో తీయసాగారు. వీరిలో అఫ్తాబ్ ఫుడ్ డెలివరి బాయ్‌గా, మతీమ్ వెల్డింగ్ పని చేస్తున్నారు. వీరిద్దరూ పట్టాలపై డ్యాన్స్ చేస్తుండగా జబీవుల్లా వీడియో తీస్తున్నాడు. కోలారు నుంచి బెంగళూరుకు వస్తున్న ప్యాసింజర్ రైలు వస్తున్నా అలాగే వీడియోలో లీనమయ్యారు. చివరకు రైలు ఢీకొనడంతో అఫ్తాబ్ పట్టాల పక్కలోని విద్యుత్ స్తంభానికి తగిలి, మతీమ్ 20 అడుగుల దూరంగా ఎగిరిపడి చనిపోయారు. జబీవుల్లాకు తీవ్ర గాయాలైనాయి.
Comments
Please login to add a commentAdd a comment