సాలూరు ఫారెస్ట్ రేంజర్ సీజ్ చేసిన లారీ (ఫైల్)
సాలూరురూరల్ : మండలంలోని తోణాం పం చాయతీ పూతికవలస సమీపంలోని అటవీభూముల్లో అక్రమంగా ఐరన్‌ఓర్ తరలింపునకు సం బంధించి ఇద్దరు అటవీశాఖ అధికారులపై వేటు పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మామిడిపల్లి సెక్షన్ ఆఫీసర్ దేవరాజు, తోణాం బీట్ గార్డు కిరణ్‌కుమార్‌లను సస్పెండ్ చేస్తూ జూన్ 30న ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి.
పూతికవలస అట వీభూముల్లో ఐరన్ ఓర్ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదనే విషయాన్ని ఫారెస్ట్ రేంజర్ అమ్మన్నాయుడు తన నివేదికలో పొందుపరిచి ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. ఆయన నివేదిక మేరకే బీట్ గార్డు, సెక్షన్ ఆఫీసర్‌లను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
లారీని పట్టుకున్న అధికారులు
ఐరన్‌ఓర్ లోడుతో తరలింపునకు సిద్ధంగా ఉన్న టిప్పర్ లారీని 2017 సెప్టెంబర్‌లో తోణాం పంచాయతీ పూతికవలస సమీపంలో రెవెన్యూ రేంజ్ పరిధిలోని స్థలంలో అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి రెవెన్యూ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. దీనిపై విచారణ నిర్వహించారు
అనుమతుల్లేకుండా..
రిజర్వ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పూతికవలసలో అక్రమంగా ఐరన్‌ఓర్ తవ్వకాలు జరిగినట్లు గుర్తించాం. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అక్కడ పనిచేసే సిబ్బంది మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.దీంతో ఇద్దరి ఉద్యోగులను సస్పెండ్ చేశారు. – అమ్మన్నాయుడు,
Comments
Please login to add a commentAdd a comment