
కృష్ణా జిల్లా: చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామంలోని పవర్ గ్రిడ్ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణ పనులు చేస్తుండగా ఇనుప పోల్ కూలి మీద పడటంతో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. గాయాలైన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితులంతా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పవర్ గ్రిడ్ టవర్ కూలీ పనుల నిమిత్తం వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు.