ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): వివాహమైన తొలి రోజుల్లోనే భార్య మొబైల్‌కు అశ్లీల వీడియోలు, ఫొటోలు రావడాన్ని గమనించి భర్త షాక్‌కు గురయ్యాడు. ఈ ఘటనతో తన భార్యతో పాటు కుటుంబ సభ్యులు సుబ్రమణ్యనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాసన్ జిల్లాకు చెందిన మహిళ చిక్కమగళూరు జిల్లాలోని ఓ కోర్టులో టైపిస్ట్‌గా పని చేస్తోంది. 2019 జూన్ 30న బెంగళూరు సుబ్రమణ్యనగరకు చెందిన మధుకు (పేరుమార్చాం) ఇచ్చి నిశ్చితార్థం చేశారు. నవంబర్ 24 వీరి వివాహం వైభవంగా జరిపించారు. పెళ్లయిన పది రోజులు మాత్రమే భర్తతో కలిసి సుబ్రమణ్యనగరలో సదరు మహిళ ఉంది. డిసెంబర్ 12న తిపటూరులో వియ్యంకుల భోజనం ఏర్పాటు చేశారు. అయితే డిసెంబర్ 15న తిపటూరులో తొలిరాత్రిని ఏర్పాటు చేశారు.
అంతకు రెండు రోజుల ముందు ప్రమోద్‌కుమార్ (పేరు మార్చారు) అనే వ్యక్తి మహిళ ఫేస్‌బుక్ మెసెంజర్‌లో తను నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోను అప్‌లోడ్ చేశారు. వివరాలకు తనను సంప్రదించాలంటూ మొబైల్ నంబర్ ఇచ్చారు. మధు ప్రమోద్ నంబర్‌కు ఫోన్ చేయగా సదరు వ్యక్తి తాము భార్యభర్తలమని మా మధ్య ఏడేళ్లు నుంచి ప్రేమ వ్యవహరం సాగినట్లు తెలిపారు. నిశ్చితార్థమైన తరువాత కూడా తమిద్దరం కలిసిన ఫోటోలున్నట్లు చెప్పాడు. ఫోన్ మెసేజ్‌లు, చాటింగ్‌ల స్క్రీన్‌షాట్ చేసి మధుకు పంపించాడు.
ప్రేమ వ్యవహారం బయట పడగానే తాను చిక్కమగళూరు నుంచి బెంగళూరుకు రానంటూ ఆమె మొండికేసింది. ఇలా ప్రేమికుడి చేతిలో మానసికంగా ఇబ్బంది పడిన మధు, ఆయన కుటుంబసభ్యులు సుబ్రమణ్యనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రమోద్‌తో పాటు ప్రేమికురాలిని కూడా పోలీసులు ఇటీవల స్టేషన్‌కు పిలిపించి విచారించగా ప్రమోద్‌తో ఉన్న ప్రేమ కథను వివరించింది. మధు కుటుంబం అప్పులు చేసి పెళ్లి చేశారు. ఇప్పుడు మరో వ్యక్తితో ప్రేమ కథను చెప్పటంతో కుటుంబంతో పాటు పోలీసులు తలల పట్టుకున్నారు. (కాఫీ డే సిద్ధార్థ కేసులో షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment