
ప్రతీకాత్మకచిత్రం
భోపాల్ : మహిళకు భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చిన మీదట అతడి అంగీకారంతో ఓ తాంత్రికుడు హలాలా పేరుతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. మహిళ ఫిర్యాదుతో ఆమె భర్తతో పాటు తాంత్రికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్ నగరంలోని అశోకా గార్డెన్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. ఇటీవల తన భర్త తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చాడని సమస్య పరిష్కారం కోసం తాంత్రికుడిని ఆశ్రయించగా భర్త అంగీకారంతో తాంత్రికుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత మహిళ తెలిపారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో వీరి వివాహం జరగ్గా నవంబర్‌లో నిందితుడు మహిళకు విడాకులు ఇచ్చాడని అయితే భార్యతో సమస్యను సర్ధుబాటు చేసుకునే ప్రయత్నంలో తాంత్రికుడిని ఆశ్రయించాడని పోలీసులు వెల్లడించారు. పూజల పేరిట బాధితురాలిని ఫ్లాట్‌కు తీసుకువెళ్లిన తాంత్రికుడు హలాలా పేరిట ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ఐష్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి భర్తతో పాటు తాంత్రికుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment