
సాక్షి, జనగామ(వరంగల్) : తన వ్యక్తిగత పనిపై వెళ్లేందుకు రహదారిపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళకు లిఫ్ట్ ఇచ్చి ద్విచక్రవాహనదారుడు దోపిడీకి పాల్పడిన ఘటన ఆదివారం చంపక్‌హిల్స్ డంపింగ్ యార్డు వద్ద చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓబుల్‌కేశ్వాపూర్– పెద్దపహాడ్ ఎక్స్‌రోడ్డు వద్ద జనగామకు వచ్చేందుకు ఓ మహిళ బస్సు కోసం ఎదురు చూస్తుంది. అదే సమయంలో అటుగా వస్తున్న ద్విచక్రవాహదారుడు ఆమెకు లిఫ్టు ఇస్తానని బైక్‌పై ఎక్కించుకున్నాడు. చంపక్‌హిల్స్ డంపింగ్ యార్డు వద్దకు రాగానే వ్యక్తిపై అనుమానం వచ్చిన సదరు మహిళ కేకలు వేయడంతో నోరును గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. అరిస్తే చంపేస్తానని బెదిరిస్తూ ఆమె బ్యాగులో ఉన్న పర్సుతో పాటు సెల్‌ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.