
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై ముగ్గురు యువకులు అత్యాచారం జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరకులోయ మండలం వెన్నెల పంచాయితీకి చెందిన ముగ్గురు యువకులు అదే గ్రామానికి చెందిన బాలికల నగ్న ఫోటోలు తీసి బెదిరించి అత్యాచారం జరిపారు.
ఈ విషయం బాలికలు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు అరకులోయ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు యువకులపై కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment