న్యూఢిల్లీ: ఢిల్లీలో కోవిడ్-19 కట్టడి చర్యలపై హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమావేశం ముగిసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు కీలక నిర్ణయాలు తీసుకున్నామని అమిత్ షా తెలిపారు. దేశ రాజధానిలో కరోనా కట్టడికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. రెండు రోజుల్లో ఢిల్లీలో కోవిడ్ టెస్టులను రెట్టింపు చేస్తామని, ఆరు రోజుల్లో కరోనా టెస్టుల సామర్ధ్యం మూడింతలు చేస్తామన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తామని హోంమంత్రి తెలిపారు. కంటైన్‌మెంట్ జోన్లలో ప్రతి ఇంట్లో సర్వే చేయాలని ఆయన ఆదేశించారు. ఆ జోన్లలో ఉన్నవారందరికీ టెస్టులు నిర్వహించాలని చెప్పారు.
(చదవండి: సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య)
పోలింగ్ స్టేషన్ పరిధిలో కరోనా పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు హోంమంత్రి నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధితులకు బెడ్ల కోసం 500 రైల్వే కోచ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. కోవిడ్ మృతుల అంత్యక్రియలకు సంబంధించిన నూతన గైడ్‌లైన్స్ రూపొందిస్తామన్నారు. ఢిల్లీలో కరోనా కట్టడికి ప్రత్యేకంగా ఐదుగురు అధికారులను నియమిస్తామని అన్నారు. కరోనాపై పోరులో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్, స్వచ్ఛంద సంస్థల సేవలు వాడుకుంటామని అమిత్ షా చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులు 60 శాతం బెడ్లు తక్కువ ధరకే ఇవ్వాలని ఆయన కోరారు. కరోనా చికిత్స, టెస్టింగ్ ధరలపై డాక్టర్ పాల్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు హోమంత్రి అమిత్ షా ప్రకటించారు.
(చదవండి: బాలికను రూ.1.5 లక్షలకు అమ్మారు.. ఆపై)
Comments
Please login to add a commentAdd a comment