డల్లాస్ లో వైభవంగా సాహిత్య సదస్సు
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఫిబ్రవరి 21న దేశీప్లాజా స్టూడియోలో వైభవంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రవాసంలో నిరాటంకంగా 103 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం.
కాగా.. డాక్టర్ చుక్కా రామయ్య ‘ప్రతిభ సమత్వం’ అనే పుస్తకాన్ని మార్తినేని మమత సభకు పరిచయం చేసారు. ‘టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు’ ఏప్రిల్ 16న ఇర్వింగ్ హైస్కూల్ లో నిర్వహించనున్నారు. కార్యక్రమంలో దొడ్ల రమణ, వరిగొండ శ్యాం, య్యుని శ్రీనివాస్ తో పాటు పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.