ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాకొట్టిన ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి
ఖాజీపేట: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాకొట్టిన ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా ఖజీపేట మండలం పి. కొత్తపల్లి గ్రామ శివారులో గురువారం ఉదయం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కొత్తపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.