పది పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
Published Sun, Nov 20 2016 1:01 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
కర్నూలు సిటీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా హైస్కూల్ హెచ్‌ఎంలకు 30, హెచ్‌ఎంలు వచ్చే నెల 1వ తేదీ నాటికి సబ్ ట్రెజరీల్లో చెల్లించాలన్నారు. వచ్చే నెల 3 నుంచి 5వ తేదీలోపు నామినల్ రోల్స్ పంపించాలని, అపరాధ రుసుముతో వచ్చే నెల 9వ తేదీన, రూ.200 అపరాధ రుసుముతో వచ్చే నెల 19 వరకు, రూ.500 అపరాధ రుసుముతో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నాటికి ఫీజులు చెల్లించవచ్చన్నారు.
Advertisement
Advertisement