ఐదుగురు మించి కనిపిస్తే అరెస్ట్‌ | 144 section in vizag | Sakshi
Sakshi News home page

ఐదుగురు మించి కనిపిస్తే అరెస్ట్‌

Published Thu, Jan 26 2017 3:04 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఐదుగురు మించి కనిపిస్తే అరెస్ట్‌ - Sakshi

ఐదుగురు మించి కనిపిస్తే అరెస్ట్‌

విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడ్డుకోవడం కోసం సిటీ పోలీసులు బుధవారం రాత్రి అత్యవసరంగా సమావేశమయ్యారు. ప్రత్యేక వ్యూహాలను రూపొందించుకున్నారు. ప్రతి పోలీస్‌ తమ స్మార్ట్‌ఫోన్‌తో ఫొటోలు తీసి పంపాలని, వాటి ద్వారా సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవచ్చని సిటీ పోలీస్‌ కమిషనర్‌ టి.యోగానంద్‌ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

నగరంలో 144 సెక్షన్‌ విధించారు. బుధవారం సాయంత్రం 5గంటల నుంచి శుక్రవారం ఉదయం 6గంటల వరకూ 36 గంటల పాటు నగరంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏఎస్‌ ఖాన్, లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ నవీవ్‌ గులాటీ ప్రకటించారు. అనుమతి లేకుండా సభలు, ప్రదర్శనలు, ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించకూడదని, కాదని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. 

మరో వైపు బీచ్‌ రోడ్‌లో శాంతి భద్రతల దృష్ట్యా పలు ఆంక్షలను విధిస్తున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement