అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 400 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.