సీతంపేట(శ్రీకాకుళం): అక్రమంగా రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు 30క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం మెట్టుగూడ సమీపంలో ఆదివారం ఉదయం ఆటోలో తరలిస్తున్న 60 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.