ఓ కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకుపోయింది.
ఆత్మకూరు: ఓ కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. ఆదివారం సాయంత్రం వరంగల్ జిల్లా ఆత్మకూరు-నీర్పుల మధ్య దర్గా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.