50 పిడకలు @ రూ.15
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. పండగంటే ముందుగా గుర్తుకు వచ్చేది భోగి మంటలు. గోవు పేడతో పిడకలు చేసి దండగా మార్చి భోగి మంటలలో వేస్తారు. ఈ సంప్రదాయం పట్టణ ప్రాంతాల్లో కొంతమేర తగ్గినా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కనిపిస్తోంది.
అయితే పల్లెవాసులకు పిడకలు తయారుచేసే తీరిక, ఆసక్తి తగ్గుతోంది. దీనినే వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. 50 పిడకలను దండగా కట్టి రూ.15 విక్రయిస్తున్నారు. మొగల్తూరులోని పలు దుకాణాల వద్ద పిడకల దండలు కనిపిస్తున్నాయి. పిడకల తయారీపై గ్రామీణులలోనూ ఆసక్తి తగ్గిందనడానికి ఇది నిదర్శనం.