జాతీయబీమాయోజన ప«థకంకింద లబ్ధిదారునికి చెక్కు అందచేస్తున్న ఎమ్మెల్యే లలితకుమారి
–ఎస్‌కోట నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల
కొత్తవలస: విశాఖబీచ్‌లో గల్లంతై మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.6లక్షలు మంజూరైనట్లు శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి తెలిపారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సీఎస్‌డీటీ ఆనందరావు అధ్యక్షతన జాతీయకుటుంబ బీమాయోజనప«థకం కింద 53మంది లబ్దిదారులకు మంజూరైన రూ.6.60లక్షల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మే నెలలో విశాఖపట్నం ఆర్‌కె,బీచ్‌లో విద్యార్థులు గల్లంతై మృతిచెందిన విషయం ఇప్పటికీ మరువలేనిదన్నారు.ఆ మూడుకుటుంబాలకు ఒక్కొక్కరికి రెండులక్షలు వంతున సీఎం సహాయనిధినుంచి మంజూరయ్యాయని చెప్పారు. కొత్తవలసలో ఉన్న ముస్లిం సోదరులకోసం షాదీఖానానిర్మాణానికి రూ.20లక్షలు మంజూరయ్యాయని ఇందుకోసం స్థలం చూడవలసిందిగా తహసీల్దార్‌కు సూచించానన్నారు.
పంచాయతీ అభివృద్ధిపై అసహనం
కొత్తవలస పంచాయతీ అభివృద్ధికి సుమారు రూ.ఆరుకోట్ల నిధులు మూలుగుతున్నా అభివృద్ధి జాడలు ఎక్కడా కనిపించలేదని కొత్తవలస ఒకటవ ఎంపీటీసీ సభ్యుడు, మండల వైఎస్సాఆర్‌సీపీ అధ్యక్షుడు మేళాస్త్రి అప్పారావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే నిధులుండీ ఎందుకు పనులుచేయలేదో త్వరలో పంచాయతీ పాలకవర్గంతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని హామీఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కె.రమణమ్మ.మండల ఉపాధ్యక్షుడు పి.రాజన్న మండల టీడీపీ అధ్యక్షుడు కోళ్ల శ్రీను పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.