జిల్లాకు 6 వేల టన్నుల బియ్యం | 6000 tonnes rice of district | Sakshi
Sakshi News home page

జిల్లాకు 6 వేల టన్నుల బియ్యం

Nov 9 2016 10:54 PM | Updated on Sep 4 2017 7:39 PM

జాతీయ ఆహార భద్రత చట్టం కింద జిల్లాకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 6 వేల టన్నుల బియ్యాన్ని త్వరలోనే పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఒక ప్రకటనలో తెలిపారు.

- ఆహార భద్రత చట్టం కింద కేంద్రం కేటాయింపు
- త్వరలో పంపిణీ
– జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం


అనంతపురం అర్బన్‌ : జాతీయ ఆహార భద్రత చట్టం కింద జిల్లాకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 6 వేల టన్నుల బియ్యాన్ని త్వరలోనే పంపిణీ చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఒక ప్రకటనలో  తెలిపారు.  తెల్ల కార్డులు కలిగిన వారు కాకుండా మిగిలినవారు  తమ ఆధార్‌ కార్డు ద్వారా చౌక దుకాణాల నుంచి బియ్యం పొందవచ్చునన్నారు.  కిలో రూ.23.50 పైసలుగా ఒక్కొక్క కుటుంబానికి ఐదు కిలోలు ఇస్తారని తెలిపారు. ఈ బియ్యం అమ్మకం కూడా ఈ–పాస్‌ ద్వారానే జరుగుతుందని తెలిపారు. పంపిణీకి సంబంధించి తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement