8, 9 తరగతులకు ఇకపై డిజిటల్ విద్య
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో నాణ్యమైన
విద్యనందించడమే లక్ష్యం
గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ పద్మ
రాజవొమ్మంగి : గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఇకపై డిజిటల్ విద్యను ప్రవేశపెట్టి ఆయా పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి తీసుకు వెళ్లనున్నట్టు గిరజన సంక్షేమ శౠఖ డైరెక్టర్ ఎం.పద్మ పేర్కొన్నారు. బుధవారం రాజవొమ్మంగిలోని గురుకుల పాఠశాల, కళాశాలలను ఆమె సందర్శించారు. అక్కడ మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనసంక్షేమ అధికారులను ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 368 ఆశ్రమ పాఠశాలలు, 186 గురుకులాలు వున్నాయన్నారు. వీటిలో దశలవారీగా తొలుత 8,9 తరగతులకు ఆపై 10వ తరగతికి డిజిటల్ విద్యను అందజేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. వసతి గృహాలను ఆశ్రమపాఠశాలలుగా మార్పు చేసిన నేపథ్యంలో ఆయా నూతన ఆశ్రమపాఠశాలల్లో మూడో తరగతి నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు. రూ.150 కోట్ల బడ్జెట్‌తో పిల్లలకు పోషకాహారం, డార్మిటరీలు, డైనింVŠ Sహాళ్లు, తరగతి గదుల్లో అవసరమైన ఫర్నిచర్, బెడ్స్ తదితర మౌలికవసతులు కల్పిస్తామన్నారను. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ట్రెబల్ వెల్ఫేర్ వాడ్రేవు చినవీరభద్రుడు, జాయింట్ డైరెక్టర్ బాలయోగి, డీడీ ప్లానింగ్ చినబాబు, డీడీ హెల్త్ చంద్రిక, ఏపీఓ నాయుడు, ఏటీడబ్ల్యూఓ రాజారావు, ఈఈ పీకే నాగేశ్వరరావు, ప్రిన్స్‌పాల్స్ నరసింహారావు, సత్యవేణి పాల్గొన్నారు.