మహిళా వర్సిటీ
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అధికారుల కృషి ఫలించింది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ (నాక్) ఏ–గ్రేడ్‌ను సాధించింది. 3.11 గ్రేడ్ పాయింట్లతో ఈ హోదా సొంతమైంది. తాజాగా ఎస్వీయూ, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సరసన ఈ వర్శిటీ కూడా చేరింది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కమిటీ , శుక్రవారం, ఏ–గ్రేడ్
–నాక్– ఏ గ్రేడ్ గుర్తింపు
–వర్శిటీ వర్గాల్లో ఆనందం
యూనివర్సిటీ క్యాంపస్ : శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అధికారుల కృషి ఫలించింది. నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ (నాక్) ఏ–గ్రేడ్‌ను సాధించింది. 3.11 గ్రేడ్ పాయింట్లతో ఈ హోదా సొంతమైంది. తాజాగా ఎస్వీయూ, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం సరసన ఈ వర్శిటీ కూడా చేరింది. మహిళా విశ్వవిద్యాలయంలో తమిళనాడులోని భారతీదాసన్ యూనివర్సిటీ మాజీ వీసీ కె.మీణ నేతృత్వంలోని కమిటీ జూలైలో పర్యటించింది. విశ్వవిద్యాలయంలోని బోధన, పరిశోధన, విస్తరణ, మౌలిక వసతులను పరిశీలించింది. కమిటీ తన నివేదికను బెంగళూరులోని నాక్‌కు సమర్పించింది. నాక్ గురువారం 17వ స్టాడింగ్‌కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ఏ–గ్రేడ్‌ఇవ్వాలని నిర్ణయించింది. శుక్రవారం రాత్రి ఫలితాలను ప్రకటించింది. మహిళా వర్సిటీ 3.11 పాయింట్లతో ఎ–గ్రేడ్ సాధించింది.
బీ నుంచి ఏకు
శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం 2009లో బి–గ్రేడ్‌సాధించి రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 2012 నుంచి2015 వరకు వీసీగా ఉన్న రత్నకుమారి యూనివర్సిటీని అభివృద్ధి చేశారు. అనేక భవన నిర్మాణాలు చేపట్టారు. మౌలిక వసతులు పెంచారు. 24 అధ్యాపక పోస్టులను భర్తీ చేశారు. 2015లో వీసీగా నియమితులైన దుర్గాభవాని బోధన, పరిశోధన అంశాల్లో నాణ్యత పెంచేందుకు ప్రయత్నించారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో అవగాహన ఒప్పందాలు(ఎంవోయూ)లు కుదుర్చుకుంది. ఇవన్నీ ఏ–గ్రేడ్ రావడంలో దోహదపడ్డాయి. ఎ–గ్రేడ్‌దక్కడంతో వర్సిటీలో ఆనందోత్సహాలు విరిశాయి. యూనివర్సిటీలోని అధ్యాకులు, విద్యార్థులు, సిబ్బంది చేసిన కృషికి ఫలితం దక్కిందని వీసీ ప్రొఫెసర్ వి.దుర్గాభవాని వ్యాఖ్యానించారు. బోధన, పరిశోధన ,విస్తరణ, మౌలిక రంగాల్లో చేసిన కృషికి ఫలితం దక్కిందని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి పేర్కొన్నారు.