-
దూరవిద్య అభ్యర్థులకు ‘నరకం’
-
పరీక్ష కేంద్రం ఇష్టానుసార మార్పుతో అయోమయం
-
సమాచారం తెలియక అవస్థలు పడుతున్న విద్యార్థులు
ఆం««ధ్రాయూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం చేపట్టే పరీక్షల నిర్వహణ, అడ్మిషన్ల తీరు, వారి పనితీరు విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. విద్యార్థులకు తరగతుల నిర్వహణ నుంచి స్టడీ మెటిరీయల్ పంపిణీ, హాల్ టికెట్ల జారీతో పాటు చివరకు పరీక్ష కేంద్రాల ఏర్పాటు అంతా అయోమయంగా ఉంటోందని అభ్యర్థులు వాపోతున్నారు.
– బాలాజీచెరువు(కాకినాడ)
ఏయూ దూరవిద్యా కేంద్రం ఏటా డిసెంబర్, మే నెలలో పరీక్షలు నిర్వహిస్తోంది. 2016 డిసెంబర్ పరీక్షల్లో భాగంగా ఈ నెల 16 నుంచి డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ విభాగంలో పరీక్షలు ఏయూ దూరవిద్యాకేంద్రం చేపడుతోంది. పరీక్ష ఫీజు, దరఖాస్తు స్వీకరణ సమయంలో వారికి దరఖాస్తులో సూచించిన పరీక్ష కేంద్రాలు లేకుండా.. పరీక్షల సమయానికి వేరే కేంద్రం కేటాయిస్తుండడంతో అభ్యర్థులు ఇబ్బందులపాలవుతున్నారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి ఏర్పడుతున్నా, తిరిగి ఈ ఏడాదీ అదే పద్ధతి అనుసరించడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని కాకినాడకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచ్చంపేట పీజీ సెంటర్‌కు మార్చడంతో అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు తీవ్ర ప్రయాసలు పడుతున్నారు. ముఖ్యంగా పరీక్ష కేంద్రానికి రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో ఆపసోపాలు పడుతున్నారు. కాకినాడ నగరం నుంచి అచ్చంపేట జంక్ష¯ŒS వరకూ మాత్రమే రవాణా సౌకర్యాలు ఉండటంతో అక్కడి నుంచి కిలోమీటర్ వరకూ నడిచి వెళ్లాల్సి వస్తోంది. ఆం«ధ్రా యూనివర్సిటీ దూరవిద్యాకేంద్ర సిబ్బంది తీరును నిరసిస్తూ గతంలో ఏబీవీపీ నాయకులు చిట్టిబాబు గతంలో ఆందోళన నిర్వహించారు. దూరవిద్యాకేంద్ర డిగ్రీ కోర్సుల పరీక్ష ఫీజు, టర్మ్ ఫీజు పెంచడంతో పాటు ఇప్పుడు మళ్లీ పరీక్ష కేంద్ర మార్పుచేసి విద్యార్థులను వ్యయప్రయాసలకు గురిచేస్తోందని విమర్శించారు.
చిన్న నోటీస్‌తో సరి...
పరీక్ష కేంద్రం మార్పు చేశామంటూ కళాశాలలో ఉన్న స్టడీసెంటర్ తలుపుకి చిన్న నోటీస్ బోర్డు ఉంచి మమ అనిపించారు. కనీసం సమాచారం తెలిపేవారు లేకపోవడంతో కొంత మందికి ఈ నోటీస్ బోర్డు కనిపించక అయోమయానికి గురవుతున్నారు.
ప్రతి ఒక్కరికీ తెలుపుతున్నాం
పరీక్ష కేంద్రం మార్పును ప్రతి అభ్యర్థికి తెలిసేలా పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశాం. అలాగే స్టడీసెంటర్ ప్రత్యేకంగా అటెండర్‌తో సమాచారం తెలుపుతున్నాం.పిఆర్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న నేపధ్యంలో కేంద్రం మార్పు చేశాం.
– కిత్తాడ వీరభద్రరావు, జూనియర్ అసిస్టెంట్, స్టడీసెంటర్