కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చిన అర్జీదారులు పడిగాపులు పడ్డారు. ప్రతివారం 10.30 గంటలకు వినతుల స్వీకరణ ప్రారంభమౌతుంది. అయితే ఈ సోమవారం 11.30 గంటలకు ప్రారంభించారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ జిల్లా అధికారుల సమీక్ష నిర్వహించడంతో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జేసి–2 రాధాకృష్ణమూర్తిలు అక్కడే ఉండిపోయారు. దీంతో కలెక్టర్, జేసీ వచ్చే వరకు అర్జీదారులు పడిగాపులు పడాల్సి వచ్చింది. చిన్నారులతో వచ్చిన మహిళలు, వృద్ధ
-
ప్రజావాణిలో 11.30 గంటలకు ప్రారంభమైన వినతుల స్వీకరణ
కాకినాడ సిటీ :
కలెక్టరేట్ ప్రజావాణికి వచ్చిన అర్జీదారులు పడిగాపులు పడ్డారు. ప్రతివారం 10.30 గంటలకు వినతుల స్వీకరణ ప్రారంభమౌతుంది. అయితే ఈ సోమవారం 11.30 గంటలకు ప్రారంభించారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ జిల్లా అధికారుల సమీక్ష నిర్వహించడంతో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జేసి–2 రాధాకృష్ణమూర్తిలు అక్కడే ఉండిపోయారు. దీంతో కలెక్టర్, జేసీ వచ్చే వరకు అర్జీదారులు పడిగాపులు పడాల్సి వచ్చింది. చిన్నారులతో వచ్చిన మహిళలు, వృద్ధులు అధికారులు వచ్చేవరకు లై¯ŒSలో నిలబడలేక ఇబ్బందిని ఎదుర్కొన్నారు.
ప్రజావాణికి 260 వినతులు
ప్రజావాణికి సుమారు 260 మంది హాజరై సమస్యలపై వినతులను అందజేశారు. కలెక్టర్ అరుణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అర్జీదారుల నుంచి వినతులు తీసుకుని సంబంధిత శాఖల జిల్లా అధికారులకు పరిష్కారం కోసం ఆదేశాలు జారీచేశారు. వ్యక్తిగత సమస్యలు, పింఛన్లు, ఉపాధి, సంక్షేమ పథకాల రుణాలు, భూ సర్వే చేయాలని, ఇళ్లు, రేష¯ŒSకార్డులు కావాలని అర్జీలు వచ్చాయి.