ప్రజావాణికి 200 అర్జీలు
Published Tue, Jan 31 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM
కాకినాడ సిటీ :
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి సుమారు 200 అర్జీలు వచ్చాయి. వాటిని పరిశీలించిన కలెక్టర్ అరుణ్‌కుమార్ సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణిలో వ్యక్తిగత సమస్యలు, పింఛన్లు, ఉపాధి, సంక్షేమ పథకాల రుణాలు, ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన అర్జీలు కలెక్టర్ స్వీకరించగా, జేసీ ఎస్.సత్యనారాయణ భూమి రికార్డులు, సర్వే చేయాలని, ఇళ్లు కావాలని, రేష¯ŒS కార్డులు తదితర అంశాలకు సంబంధించిన అర్జీలు, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి ఐసీడీఎస్, వైద్యం, సంక్షేమ పథకాలు, ప్రత్యేక ప్రతిభావంతుల శాఖలకు సంబంధించిన అర్జీలు స్వీకరించారు. మండల స్థాయి అంశాలపై సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓలకు కలెక్టర్ వీడియో కాన్ఫరె¯Œ్స వ్యవస్థ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.
ముంపు ప్రాంత నిర్వాసితుల సంఘం వినతి
వివిధ సమస్యలపై పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసిత నిరుద్యోగ సంఘం సోమవారం ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రా న్ని అందజేసింది. ముంపు ప్రాంత నాలుగు మండలాల్లో మీ–సే వా కేంద్రాలు, ఆదివాసిలకే కేటాయించాలని, జీఓ ఎంఎస్‌నంబర్–3 ప్రకారం పోస్టులన్నీ భర్తీ చేయాలని, 18 ఏళ్లు దాటిన యువతీ యువకులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించి వారికి ప్రత్యేక పునరావాసం కల్పించాలని తదితర డిమాండ్లతో వినతిపత్రంలో కోరారు. సంఘ నాయకులు చిచ్చడి శ్రీరామమ్మూర్తి తదితరులు వినతిపత్రం ఇచ్చినవారిలో ఉన్నారు.
Advertisement
Advertisement