ప్రతి ఒక్కరూ వారి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సూచించారు. గురువారం కలెక్టరేట్ విధానగౌతమి హాల్‌లో వివిధ మండలాల అధికారులు, వ్యాపారులకు నగదు రహిత లావాదేవీలపై ఇ¯ŒSఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనా¯Œ్స కార్పొరేష¯ŒS (ఐడీఎఫ్‌సీ) శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ
-
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
కాకినాడ సిటీ :
ప్రతి ఒక్కరూ వారి బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సూచించారు. గురువారం కలెక్టరేట్ విధానగౌతమి హాల్‌లో వివిధ మండలాల అధికారులు, వ్యాపారులకు నగదు రహిత లావాదేవీలపై ఇ¯ŒSఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫైనా¯Œ్స కార్పొరేష¯ŒS (ఐడీఎఫ్‌సీ) శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మండలానికి రెండు గ్రామాలను ఎంపిక చేసి నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి చర్యలు చేపట్టామన్నారు. ఆయా గ్రామాల్లోని వ్యాపారులు యాప్‌ను డౌ¯ŒSలోడ్ చేసుకుని బయోమెట్రిక్ ఆధారిత నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తారన్నారు. ఇప్పటికే జిల్లాలో 200 బయోమెట్రిక్ సాధనాలు అందుబాటులో ఉన్నాయని, వాటిలో రాజమహేంద్రవరానికి 30, కాకినాడకు 25, పెద్దాపురానికి 40, అమలాపురానికి 60, రామచంద్రపురానికి 30, పౌరసరఫరాలశాఖకు 10, మార్కెటింగ్ శాఖకు ఐదు ఇచ్చామని తెలిపారు. బయోమెట్రిక్ సాధనాల ద్వారా నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. నగదు రహిత లావాదేవీల్లో వినియోగదారులకు ఎలాంటి చార్జీలు, వ్యాపారస్తులకు సర్వీసు చార్జీలు ఉండవన్నారు. వినియోగదారుని వేలిముద్రే బ్యాంకు పాస్‌వర్డ్ అన్నారు. వేలిముద్ర వేయడం ద్వారా కస్టమర్ బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము వ్యాపారునికి బదిలీ అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి వి.రవికిరణ్, ఎ¯ŒSఐసీ డీఐవో ఎస్.ఉస్మాన్, సుబ్బారావు, రాజమహేంద్రవరం ఐడీఎఫ్‌సీ మేనేజర్ మీరావలి, పలు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.