నగర పాలక సంస్థకు కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి విధులు నిర్వర్తిస్తున్నా నగరంలో ఆసీల దందా యథేచ్ఛగా సాగుతోంది. కాంట్రాక్టర్ల దోపిడికి చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నగరంలోని వివిధ మార్కెట్ల వద్ద సైకిల్, మోటారు సైకిల్‌పై వ్యాపారాలు చేసుకునే
-
ఐఏఎస్ పాలనలోనూ మారని తీరు
-
యథేచ్ఛగా అధిక వసూళ్లు
-
అధికారుల అనుమతి లేకుండా నగదు టోకెన్లు పంపిణీ
సాక్షి, రాజమహేంద్రవరం :
నగర పాలక సంస్థకు కమిషనర్‌గా ఐఏఎస్ అధికారి విధులు నిర్వర్తిస్తున్నా నగరంలో ఆసీల దందా యథేచ్ఛగా సాగుతోంది. కాంట్రాక్టర్ల దోపిడికి చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నగరంలోని వివిధ మార్కెట్ల వద్ద సైకిల్, మోటారు సైకిల్‌పై వ్యాపారాలు చేసుకునే వారు అధికారుల లెక్కల ప్రకారమే దాదాపు 4 వేల మంది ఉన్నారు. గతేడాది ఈ వ్యాపారుల నుంచి రోజుకు రూ.2 మాత్రమే వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో సైకిల్, మోటారు సైకిల్ రోజు ఆసీలు రూ.8కి పెంచారు. అయితే ప్రస్తుతం జాంపేట, లింగంపేట మార్కెట్ల పరిధిలో రూ.20, ఆల్‌కట్‌తోటలో రూ.40, సెంట్రల్ కూరగాయలు, పండ్లు మార్కెట్ వద్ద రూ.20, మునికుట్ల అచ్యుతరామయ్య (కంబాల చెరువు), కోరుకొండ రోడ్డులోని జయకృష్ణపురం వద్ద రూ.25 లెక్కన వసూలు చేస్తున్న విషయం ‘సాక్షి’పరిశీలనలో తేటతెల్లమైంది. జాంపేటలో టోకె¯ŒS ఇవ్వకుండానే రూ.30 లెక్కన తీసుకుంటున్నారు. వీరందరూ నగర పాలక సంస్థ పేరుతో టోకెన్లు జారీ చేస్తున్నారు. అయితే వాటిపై అధికారుల సంతకం, ఆమోద ముద్ర లేకపోవడం విశేషం. ఇప్పటికైనా నిర్ణీత రేట్ల మేరకే ఆసీలు వసూలు చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.