ఏబీవీపీ విద్యార్థులపై ప్రిన్సిపల్ దాడి
Published Tue, Jul 26 2016 3:46 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్గొండ: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ప్రిన్సిపల్ వీధి రౌడీలా ప్రవర్తించాడు. ఆచార్యదేవో భవ అన్న పదానికే అర్ధం లేకుండా చేశాడు. బంద్‌లో పాల్గొనండి అన్న పాపానికి విద్యార్థులను విచక్షణారహితంగా చితకబాదాడు. అధిక ఫీజులు నియంత్రించాలంటూ ఏబీవీపీ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో ప్రియదర్శిని కాలేజీ యాజమాన్యాన్ని బంద్‌లో పాల్గొనాలని కోరారు. అంతే కళాశాలలోకి రావడానికి ఎవరు అనుమతి ఇచ్చారంటూ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్‌రెడ్డి విద్యార్థులను చితకబాదాడు. ఇష్టం వచ్చినట్లు బండబూతులు తిట్టుకుంటూ కళాశాల బయటి వరకు తరిమి కొట్టాడు. ప్రిన్సిపల్ దాడికి నిరసనగా కళాశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement