
ఆరు సార్లు దొరికి పోయాడు..
ఆదిలాబాద్ జిల్లా దహేగామ్ తహశీల్దార్ విశ్వంబర్ ఓ రైతు నుంచి రూ.15వేలు లంచం తీసుకుంటుండగా సోమవారం ఉదయం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని బాలాజీ నగర్ ప్రాంతంలో తహశీల్దార్ నివాసం వద్ద ఈ ఘటన చేసుకుంది. సోమయ్య అనే రైతుకు చెందిన భూమి పత్రాల్లో పేరు మార్పు కోసం లంచం డిమాండ్ చేయడంతో అతడు ఏసీబీకి సమాచారం అందించాడు. దీంతో వలవేసి పట్టుకున్నారు.
తహశీల్దార్ ని అదుపులోకితీసుకుని విచారిస్తున్న అధికారులు దిమ్మతిరిగే నిజాలు తెలిశాయి. తహశీల్దార్ విశ్వంబర్ కి ఇలా లంచం తీసుకుంటూ పట్టు బడటం లో బాగానే అనుభవం ఉంది. గతంలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు సార్లు ఏసీబీకి పట్టుపడ్డాడీ అధికారి. దీంతో షాక్ తిన్న అధికారులు.. పాత కేసులను సైతం తిరగతోడే పనిలో ఉన్నారు.
మరో వైపు ఈ కార్యలయం అవినీతి అధికారులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గతంలోనూ దహేగామ్ తహశీల్దార్‌గా పనిచేసిన అమృతరావు అనే అధికారి కూడా ఇదే రీతిలో ఏసీబీకి పట్టుబడడం గమనార్హం.