
తహశీల్దార్ ఇళ్లపై ఏసీబీ దాడులు
హైదరాబాద్‌లో రెండు చోట్ల రాజమండ్రిలో ఒక చోట, విశాఖపట్నంలో నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు రామారావుకు సంబంధించిన ఇళ్లపై ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. రామారావు అల్లుడి ఇంట్లో భారీఎత్తున నగదు లభ్యమైనట్లు సమాచారం. అలాగే.. రామారావు ఇంట్లో రూ.15 లక్షలు, అల్లుడి ఇంట్లో రూ.30 లక్షల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇతర ఇళ్లలో నగలు, నగదు, ఆస్తి పత్రాలు దోరికినట్లు అధికారులు వెల్లడించారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.