ఏలూరు మున్సిపల్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి | acb raids in municipal DE house in eluru | Sakshi
Sakshi News home page

ఏలూరు మున్సిపల్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి

Published Thu, Apr 28 2016 11:57 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM

ఏలూరు మున్సిపల్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి - Sakshi

ఏలూరు మున్సిపల్ డీఈ ఇంటిపై ఏసీబీ దాడి

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మున్సిపల్ డీఈ వంగపండు వెంకట సత్యనారాయణ నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడని సత్యనారాయణపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ అధికారులు అకస్మిక దాడులు చేశారు. అతడి బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు దాడి చేసి... సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 1.10 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అలాగే పలు కీలక పత్రాలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కృష్ణాజిల్లా గుడివాడలోని మరో ప్రదేశాలలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారని సమాచారం.




 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement