బైక్‌ చోరీ కేసులో నిందితుడి రిమాండ్‌ | accused remandedin Bike theft case | Sakshi
Sakshi News home page

బైక్‌ చోరీ కేసులో నిందితుడి రిమాండ్‌

Published Sun, Jul 24 2016 8:41 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

బైక్‌ చోరీ కేసులో నిందితుడి రిమాండ్‌ - Sakshi

బైక్‌ చోరీ కేసులో నిందితుడి రిమాండ్‌

పిట్లం : ద్విచక్ర వాహనం చోరీకి పాల్పడిన వ్యక్తిని పిట్లం పోలీసులు ఆదివారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డికి చెందిన సలీం పిట్లం మండల కేంద్రంలోని ధనలక్ష్మి రైస్‌మిల్లు ఎదుట బైక్‌ నిలిపి ఉంచాడు. మహారాష్ట్రకు చెందిన రంజిత్‌సింగ్‌ ఈ వాహనాన్ని దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోక దిగారు. శనివారం రాత్రి పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా, బైక్‌పై వస్తూ రంజిత్‌సింగ్‌ చిక్కాడు. అతడ్ని అదుపులోకి తీసుకొని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడ్ని రిమాండ్‌కు తరలించారు. ఏఎస్సై కోనారెడ్డి, సిబ్బంది సాయిశివ, పాండురంగ, అంజయ్య, గోరి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement