‘బావి స్థలం’ కబ్జాదారుపై చర్యలు? | action on well site capure | Sakshi
Sakshi News home page

‘బావి స్థలం’ కబ్జాదారుపై చర్యలు?

Published Tue, Jul 26 2016 12:14 AM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM

‘బావి స్థలం’ కబ్జాదారుపై చర్యలు? - Sakshi

‘బావి స్థలం’ కబ్జాదారుపై చర్యలు?

ఆరా తీస్తున్న డీటీసీపీ‌ అధికారులు
అక్రమార్కులను కాపాడుతున్న ప్రముఖులు


దశాబ్దాల కాలంగా ప్రజల దాహార్తిని తీర్చిన మున్సిపాలిటీకి చెందిన మంచి నీటి బావి కాస్త అక్రమార్కుల కన్ను పడి కబ్జాకు గురైంది. ఇంకేముంది పట్టణ నడిబొడ్డున ఉండడం.. మంచిరేటు పలుకుతుండడంతో దానిని కాస్త పూడ్చేసి దానిపై షాపింగ్‌ సముదాయాలను నిర్మించారు కబ్జాకోరులు. విషయాన్ని గ్రహించిన అధికారులు రెండు నెలల క్రితం నోటీసులు పంపినా.. ప్రజాప్రతినిధుల అండదండలతో అక్రమార్కులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం.    - వికారాబాద్‌


పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్‌లో గల మంచినీటి బావిని ఆక్రమించి షాపింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మించిన వారిపై డీటీసీపీ‌ అధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. వివరాలిలా ఉన్నాయి.. మార్కెట్‌లో గల ఈ బావి సుమారు 50 ఏళ్లుగా పట్టణంలోని ఆరు వార్డులకు తాగునీటిని అందించింది. అయితే కొంత కాలం క్రితం దీనిపై పలువురి కన్ను పడింది. ఇకేంముంది.. నకిలీలు సృష్టించి ఆ స్థలాన్ని కబ్జా చేసి ఏకంగా షాపింగ్‌ క్లాంపెన్స్‌ను నిర్మించారు. వీటికి సంబంధించిన రికార్డులను సైతం స్థానిక మున్సిపాలిటీలో కొందరు కాసులకు కక్కుర్తి పడి మాయం చేసినట్లు ఆరోపణలు లేకపోలేదు.

          బావి స్థలాన్ని కబ్జా చేశారంటూ రెండు నెలల క్రితం పలు దినపత్రికల్లో కథనాలు రావడంతో స్పందించిన టౌన్‌ప్లానింగ్‌ అధికారులు వారి దగ్గర ఉన్న రికార్డులతో కబ్జాకోరులను గుర్తించి తాఖీదులను అందచేశారు. మీ దగ్గర ఉన్న నిర్మాణాలకు సంబంధించిన ధ్రువపత్రాలను 11 రోజుల్లో టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు అందచేయాలని, లేనిపక్షంలో రెండో నోటీస్‌ ఇచ్చిన తరువాత మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటీసులకు ఒక్కరు మాత్రమే స్పందించాడు. తాను 15 గజాల స్థలాన్ని మాత్రమే కబ్జా చేసినట్లు అధికారులకు విన్నవించుకున్నాడు. మిగిలిన వారికి పట్టణ ప్రముఖులు అండగా ఉంటూ తెరవెనక రాజకీయాలు నడిపిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. దీంతో మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూడా రెండు నెలలుగా తటస్థంగా ఉండిపోయారు. కాగా.. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి డీటీసీపీ హైదరాబాద్‌ కార్యాలయంలో ఉన్న రికార్డులను తిరగేస్తున్నట్లు సమాచారం.

మున్సిపల్‌ అధికారులకు ముచ్చెమటలు..
పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్‌లోనే కొత్త మార్కెట్‌ను నిర్మించాలని భావించిన అధికారులు ఆదిశగా ప్రణాళికలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులను సైతం మంజూరు చేసింది.  అయితే.. ఇక్కడే అసలు కథ మొదలైంది. పాతకూరగాయల మార్కెట్‌ స్థలం రికార్డుల ప్రకారం1.02 గుంటల భూమి గతంలో ఉండేది. అది కాస్త రోజు రోజుకు కుచించుకుపోయింది. ప్రస్తుతం ఆ స్థలం ఎంత మేరకు ఉంది? ఎవరి హయాంలో కబ్జాకు గురైంది. పూర్తి వివరాలను వెంటనే పంపించాలని డీటీసీపీ‌ అధికారులు స్థానిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement